ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
భారత ప్రజాస్వామ్యాన్ని రాజకీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు తన జీవితాన్ని అర్పించిన, యువనాయకుడు భావి భారత ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల తరపున అగ్రనేతకు పుట్టినరోజు తెలియజేసారు.
