గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఓపెనింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే జారే

TEJA NEWS

గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఓపెనింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన HP పెట్రోల్ బంక్‌ను, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెట్రోల్ బంక్ ద్వారా జగన్నాధపురం మరియు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు సులభంగా పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వస్తుందన్నారు. రైతులు వాహనదారులకు నాణ్యమైన ఇంధనాన్ని సరఫరా చేసి వారి మన్ననలు పొందాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ బంక్ నెలకొల్పటం అభినందనీయమని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top