పొగాకు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చం నాయుడు

TEJA NEWS

మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు పొదిలి ఏ ఏం సి చైర్మన్ డాక్టర్ ఇమాంసా, కొండయ పాలెం సర్పంచ్ సన్నేబోయిన సుబ్బారావు మరియు రైతులు పొగాకు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చం నాయుడు ని పర్చూరులోని ఏఎంసి ఆవరణలో కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు అచ్చం నాయుడు మాట్లాడుతూ రైతులు వద్ద ఉన్న ప్రతి పొగాకు బేలుకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొనడం జరుగుతుందని రైతులు ధైర్యంగా ఉండాలని వారికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పొగాకు రైతులు తమ ఆనందం వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top