పేదల వైద్య సేవలకు సహకారం : పద్మారావు గౌడ్
సాక్షిత ; సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాస్ నగర్ నివాసి మైత్రి చేతన్ కార్తీక్ అనారోగ్యంతో సతమతమవుతున్న దశలో సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అతని వైద్య చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ) పత్రాన్ని సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో గురువారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలకు సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని పద్మారావు గౌడ్ సూచించారు.
