సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్సార్ కాంగ్రెస్

TEJA NEWS
  • సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడిగా అడబాల అప్పారావు
  • *అప్పారావు అభినందించిన సజ్జల వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్సిపి గుడివాడ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు అడబాల అప్పారావు కేంద్ర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సజ్జల గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని నాయకత్వంలో పార్టీ బలోపేతం చేసే విధంగా అడబాల కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అడబాల మాట్లాడుతూ మాజీ మంత్రి కొడాలి నాని నాయకత్వంలో వైసిపి నేతగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూనే, లయన్స్ క్లబ్ లాంటి సేవా సంస్థల్లో చురుగ్గా పాల్గొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానన్నారు. అందరం కలిసి కొడాలి నాని నాయకత్వంలో ముందుకు సాగుతామని గుడివాడలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అడబాల పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top