మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని శ్రీ జగన్నాథ్ రథయాత్రకు ఆహ్వానించిన ఇస్కాన్ దేవస్థాన సభ్యులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద ఇస్కాన్ దేవస్థాన సభ్యులు ఆహ్వానన్నీ అందజేశారు.. కావున ఈ నెల 27న నిర్వహించే శ్రీ జగన్నాథ్ రథయాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా కోరారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ సానుకూలంగా స్పందించి ఆహ్వానాన్ని స్వీకరించారు…
— అనంతరం పలు సమస్యలతో వచ్చిన నియోజకవర్గం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
— నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో ఇస్కాన్ దేవస్థాన సభ్యలు,నిర్వహకులు విద్యాకల్పన, నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
