అసిస్ట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేటలోని అసిస్ట్ సంస్థ ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ జాష్టి రంగారావు యోగా దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన యోగా ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవర్చుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం సిబ్బందిలో యోగా పట్ల అవగాహనను, ఆసక్తిని పెంపొందించింది.
