ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం పై జర్నలిస్టులు

TEJA NEWS

ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం పై జర్నలిస్టులు స్పందించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లి వద్ద నిర్మాణం జరుగుతున్న మెడికల్ కాలేజీ పై ఈ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు స్పందించాలని నిజాన్ని నిర్భయంగా తెలియజేయాలని ప్రజల అవసరాలను వెలిగెత్తి చాటాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.
కలం పోటు బుల్లెట్ కంటే గొప్పదని చిన్నతనంలో విన్నానని జర్నలిస్టులకు అంత సత్తా ఉందని ఆయన అన్నారు.

1947 నుండి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు గురజాల మాచర్లలో కనీస సౌకర్యాలు కలిగిన ఒక్క ఆసుపత్రి అయినా ఉందా అని ప్రశ్నించారు.

గురజాలలో 30 పడకల ఆసుపత్రి 10,12 పబ్లిక్ హెల్త్ సెంటర్లు ఉన్నాయని అంతా కలుపుకున్న 60 పడకల ఆసుపత్రిలే అన్నారు. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు కానీ సరైన డిగ్రీ కాలేజ్ మెడికల్ కాలేజీలు లేవని ఒక్క డిగ్రీ కాలేజ్ మాచర్ల మాత్రమే ఉందని అందుకనే తాను ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించడం జరిగిందని 500 కోట్లతో మెడికల్ కాలేజ్ సాంక్షన్ చేయడం జరిగిందని పిడుగురాళ్ల సమీపాన 50 ఎకరాల్లో 12 లక్షల చదరపు అడుగులలో ప్రారంభించడం జరిగిందని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా 12 లక్షల చదరపు అడుగులు ఆసుపత్రి లేదని 600 పడకల ఆసుపత్రి, 500 మంది పిల్లలు మెడికల్ చదువులు చదువుకునేటట్లు నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగిందని అనేకమందికి విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని అన్నారు గురజాల మాచర్ల ఎక్కడ యాక్సిడెంట్లు జరిగిన అత్యవసర పరిస్థితి వచ్చిన , ఏ ఆడబిడ్డ ప్రసవించాలన్న 70,80 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుందని

నరసరావుపేట,గుంటూరు, విజయవాడ వెళ్ళవలసి వస్తుందని దాని కొరకే ఈ హాస్పిటల్ వెంటనే తేవాలని డిమేండ్ చేయడం జరిగిందన్నారు .
2024 జూన్ కాళ్ళ 90 శాతం పూర్తయిందని ఆసుపత్రిలోని పరికరాలు కూడా ఆ కాంట్రాక్టర్ యొక్క అగ్రిమెంట్ లోనే ఉన్నాయని కొత్తగా గవర్నమెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని సంవత్సర కాలం నుండి కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారని నేడు ఉన్న ప్రభుత్వం అశ్రద్ధ చేయడంతో పక్కన పడేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోకపోవడంతో గతవారం నుండి సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా అడగడం జరుగుతుందని సెల్ఫీ ఛాలెంజ్ కి విషశ స్పందన వచ్చిందని కొన్ని వందల మంది సెల్ఫీ చాలెంజ్ లో పాల్గొనడం జరిగిందని చివరికి ప్రవాస భారతీయులు కూడా సెల్ఫీ ఛాలెంజ్ లో పాల్గొనడం జరిగిందని ఈ ప్రాంతం నుండి ఇతర దేశాలకు వెళ్లినవారు సెల్ఫీ ఛాలెంజ్ లో పాల్గొన్నారు పాల్గొనడం జరిగిందని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పల్నాడు ప్రాంత జర్నలిస్టులు కూడా మీరు పనిచేసే పత్రికల, మీడియా ఛానల్, యూట్యూబ్ ల ద్వారా మీరు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న ఇక్కడ బిడ్డలగా ఇక్కడ అవసరాలు తెలుసుకొని మెడికల్ కాలేజ్ పూర్తయ్యేందుకు మీ వంతు కృషి చేయాలని కాసు మహేష్ రెడ్డి కోరారు

You cannot copy content of this page

Scroll to Top