హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్ లు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినబుద్ది చెబుతారని అన్నారు.
