సింగపూర్ లో ఆర్చరీ క్రీడాకారులకు పతకాలు

TEJA NEWS

సింగపూర్ లో ఆర్చరీ క్రీడాకారులకు పతకాలు

** అభినందించిన “శాప్” ఛైర్మన్ రవినాయుడు

విజయవాడ: సింగపూర్ లో ఈనెల 15వ తేదీ నుంచి ఆరురోజుల పాటు జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల కాంపౌండ్ ఈవెంట్‌లో తెలుగు క్రీడాకారులు పతకాలు సాధించారు. వారిలో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి.గణేష్ మణిరత్నం, ఇండివిడ్యువల్, మిక్సిడ్, టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి.షణ్ముఖి నాగసాయిలు మంగళవారం “శాప్” చైర్మన్ అనిమిని రవినాయుడును కలిసి పతకాల సాధన విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్చరీలో సాధించిన పతకాలు, విజయాలను గురించి రవినాయుడుకి వివరించారు. శాప్ ఛైర్మన్ క్రీడాకారులను అభినందించి సన్మానం నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని విస్తృతం చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఓల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఆర్చరీ కోచ్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top