శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం.

TEJA NEWS

శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం.

కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం.

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది.

ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది.

యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.

కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం –

భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు.

యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి:

1.దర్శన టికెట్ ఉన్నవారు

2.దర్శన టికెట్ లేనివారు

దర్శన టికెట్ ఉన్నవారు:

ఈ ఆప్షన్ ఎంచుకోండి.

టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది.

టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.

దర్శన టికెట్ లేనివారు:

ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన(verified) ఆధార్ నంబర్ ఇవ్వాలి.

You cannot copy content of this page

Scroll to Top