రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తున్న జగన్

TEJA NEWS

రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తున్న జగన్

** ఉపేక్షించక చట్టం అమలు చేయాలన్న టీడీపీ శ్రేణులు

చిత్తూరు: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర నేతలు ఆరోపించారు. ఈమేరకు చిత్తూరు జిల్లాకేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితర నాయకులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకిటీల సురేంద్ర కుమార్ మాట్లాడుతూ మానవత్వం లేదు…బాధ్యతా లేదు… జగన్ ది అంతా రాజకీయ ఉన్మాదమే అని తెలిపారు.
రాజకీయ ముసుగులో హింసను, అరాచకాన్ని ప్రేరిపిస్తున్న ముఠా నాయకుడుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా రాజకీయాల విలువలను దిగజారుస్తున్నారన్నారు. రాష్ట్రం లో హింస, అరాచకం సృష్టించడానికి వైకాపా శ్రేణులను ఉన్మాదుల్లా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కొందరి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారన్నారు. పరామర్శల యాత్రల పేరుతొ బలప్రదర్శనలకు దిగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలంటే ప్రజల కోసం పని చేస్తూ ఆదర్శంగా ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు..ఉన్నత స్థానాల్లో పనిచేసిన వాళ్లు… మరింత బాధ్యతగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే జగన్ లో ఆ విలువలేవీ ఉన్నట్టు కనబడ్డం లేదని వ్యాఖ్యానించ్చారు. రాజకీయాల్లో మనం ఏం మాట్లాడినా… ఏం చేసినా మనల్ని అభిమానించే వాళ్లు వాటిని అనుసరిస్తారనే స్పృహ ఉండాలని హితవు పలికారు.

కానీ దురదృష్టవశాత్తూ ముఖ్యమంత్రిగా పనిచేసి, ఒక పార్టీని నడుపుతున్న వైఎస్ జగన్ తీరు దారుణంగా
ఉంటోందని, కనీస మానవత్వం లేకుండా, ప్రజల ప్రాణాల కంటే తన రాజకీయ లబ్దికే ఎక్కువ ప్రాధాన్యం
ఇస్తున్నాడని మండిపడ్డారు. పొదిలి ఘటన తర్వాత ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ పల్నాడు
పర్యటనలో జగన్ కు కొన్ని సూచనలు చేసినా లెక్కచేయక అలజడే ధ్యేయంగా సాగారన్నారు. ప్రతి అంశాన్ని, ప్రతి పర్యటనను రాజకీయంగా
వాడుకోవాలనే ఉద్దేశ్యంతో జగన్ సొంత వ్యూహాలను, కుట్ర వ్యూహాలను అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు.
తన పర్యటనలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చనిపోతే…కనీసం జగన్ సంతాపం తెలుపలేదు.
పరామర్శ చేయలేదు. అదే బెట్టింగ్, బ్లేడ్ బ్యాచ్ ల పరామర్శకు యాత్రలు చేసిన జగన్… తన కారణంగా సొంత
పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం స్పందించలేదు. ఇదేనా మానవత్వం? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
ఇలాంటి వాళ్లు రాజకీయాలకు అర్హులా? అన్నారు. క్రూరత్వం తప్ప జగన్ విద్వేషం, విధ్వంసమే అజెండాగా పనిచేస్తున్నాడని విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోడి కత్తి, గులకరాయి డ్రామాలో దళిత యువకులను బలిచేశారు. చివరకు సొంత చిన్నాన్న హత్యను కూడా రాజకీయాలకు వాడుకున్న జగన్ ది శాడిజం కాదా అన్నారు. ఇక ఉపేక్షించక ఇలాంటి రాజకీయ ఉన్మాదికి చట్టపరంగా కఠిన శిక్షలు పడితే ఇంకొకరు ఇలా బరితెగించి రాజకీయాలు చేయరని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో టీడీపీ నాయకులు మొహన్ రాజ్ , కృష్ణమూర్తి నాయుడు, మేషాక్, సురేష్ , వెంకటేష్ లు పాల్గొన్నారు .

You cannot copy content of this page

Scroll to Top