భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్ చిలకలూరిపేట విద్యార్థిని మూకిరి మహాలక్ష్మి ట్రిపుల్ ఐటీ సీట్ కైవసం… అభినందించిన ఉపాధ్యాయ సిబ్బంది.
స్థానిక భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేట నుండి 2024- 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి 576 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన మూకిరి మహాలక్ష్మి అనే విద్యార్థిని నిన్న వెలువడిన ట్రిపుల్ ఐటీ ఫలితాలలో, నూజివీడు ఐఐఐటీ నందు సీటు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థినిని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కష్టపడి బంగారు భవిష్యత్తుని నిర్మించుకోవాలని , ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ప్రధానోపాధ్యాయులు ఆ విద్యార్థినిని దీవించారు.
