ఇన్నర్‌వీల్‌ క్లబ్ చిల‌క‌లూరిపేట‌కు 24 అవార్డులు

TEJA NEWS

ఇన్నర్‌వీల్‌ క్లబ్ చిల‌క‌లూరిపేట‌కు 24 అవార్డులు
క్ల‌బ్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ సేవా, సంక్షేమ కార్యక్రమాలకు గుర్తింపు
క్ల‌బ్ అధ్య‌క్షురాలు గ‌ట్టు స‌రోజినికి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్ తో పాటు ఎక్సల్లెంట్ సర్వీసు అవార్డ్

చిల‌క‌లూరిపేట‌:స్నేహం, సేవా అనే దృక్పథంతో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ పని చేస్తుందని, ఆ దిశ‌గానే ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఆఫ్ చిల‌క‌లూరిపేట అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని క్ల‌బ్ అధ్య‌క్షురాలు గ‌ట్టు స‌రోజిని అన్నారు. 2024-25 సంవ‌త్స‌రానికి ఇన్న‌ర్‌వీల్ ఆఫ్ చిల‌క‌లూరిపేట కు క్లబ్ కి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్ ,ఎక్సల్లెంట్ సర్వీసు అవార్డ్ తో పాటు మొత్తం 24 అవార్డ్స్ అందుకున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన రిక‌గ్న‌జేష‌న్ ఆవార్డ్స్ సెల‌బ్రేష‌న్ కార్య‌క్ర‌మంలో డిస్ట్రిక్ట్ 315 చైర్మన్ ప్రేమలత చేతుల మీదుగా ఈ ఆవార్డులు పొందారు. సంవ‌త్స‌ర కాలంగా చేప‌ట్టిన 103 వివిధ సేవా కార్య‌క్ర‌మాల‌ను గుర్తిస్తూ, అవార్డుల‌తో పాటుగా ప్ర‌శంసా ప్ర‌తాల‌ను కూడా అంద‌జేశారు. క్లబ్ ట్రెజరర్ పి రమాదేవి కి కూడా సెలెబ్రేట్ స్టార్ ట్రెజరర్ అవార్డ్ అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా క్ల‌బ్ అధ్య‌క్షురాలు గ‌ట్టు స‌రోజిని మాట్లాడుతూ సంవ‌త్స కాలంగా ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ త‌రుఫున విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో సాయం, విద్యాసంస్థ‌ల్లో మౌలిక స‌దుపాయాలు, వృద్దుల‌కు చేయూత‌, బాలికా విద్య‌కు ప్ర‌ధాన్య‌త నిస్తూ స్కాల‌ర్‌షిప్‌ల అంద‌జేత‌, ఉచిత వైద్య శిబిరాలు, ట్రైసైకిళ్ల పంపిణి, కుట్టు శిక్ష‌ణ‌, కుట్టు మిష‌న్ల పంపిణీ, ట్రాన్స్‌జెండర్లకు చేయూత‌, పేద విద్యార్ధుల‌కు ఆర్ధిక స‌హాయం, ప్ర‌భుత్వాసుప‌త్రిలో తాగునీటి స‌దుపాయం త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు. దాత‌లు, క్ల‌బ్ స‌భ్యుల స‌హ‌కారంతో ఈ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. త‌న‌తో పాటు అవార్డుల‌ను స్వీక‌రించ‌టానికి త‌న‌తో పాటు డిస్ట్రిక్ట్ చైర్మన్ కోలా విజయలక్ష్మి ,సెక్రటరీ జయలక్ష్మి ఆవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్లు తెలిపారు. ఈ పంద‌ర్బంగా ప‌లువురు ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ అధ్య‌క్షురాలు గ‌ట్టు స‌రోజినిని అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top