దివ్యాంగులకు ఒక వరం,,,, “దివ్యాంగ శక్తి” ఉచిత బస్సు ప్రయాణం

TEJA NEWS

దివ్యాంగులకు ఒక వరం,,,, “దివ్యాంగ శక్తి” ఉచిత బస్సు ప్రయాణం

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలలో దివ్యాంగ శక్తి పథకం లేకపోయినా, గత ప్రభుత్వం చేసిన అప్పుల ఊబిలో రాష్ట్ర పరిపాలన చేస్తూ, రాష్ట్రంలో 12,70,000 మంది వికలాంగులకు 20 కోట్ల భారం పడుతున్న దివ్యాంగులకు ఒక వరంలా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించారని తెలిపారు.


ఈ పథకం ద్వారా వికలాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వికలాంగులు, దివ్యాంగులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఆకుతో రమేష్, సుధాకర్ రెడ్డి, రైతు సేవా సంఘం చైర్మన్ ఏజి కిషోర్, డిపో మేనేజర్ కళ, నాయకులు, ఆర్టీసీ సిబ్బంది, వికలాంగులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top