కార్పొరేషన్ పరిధిలోని యూజీడీల నిర్మాణంపై, పూర్తిస్థాయి విచారణ జరపాలి….
-సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య…
పెద్దపల్లి :. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కి సంబంధించిన 13 కోట్ల 70 లక్షల రూపాయలను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి ఏడు ప్యాకేజీలుగా టెండర్లకు పిలవడం జరిగింది, అందులో జరిగిన అవినీతిపై విచారణ జరిపి విచారణ జరిగేంతవరకు అట్టి బిల్లులు చెల్లించకుండా చర్యలు తీసుకోవాలని, అవినీతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 41వ. డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ఈ రోజు పెద్దపల్లి లో జరిగిన ప్రజావాణి లో కలెక్టరేట్ ఏ.ఓ కి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ “రామగుండం నగరపాలక సంస్థ లో ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కి సంబంధించిన 13 కోట్ల 70 లక్షల రూపాయలకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం ఏడు ప్యాకేజీలుగా టెండర్ల పిలవడం జరిగిందని కానీ రామగుండం కార్పొరేషన్ లో గల కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారి 0.5 టు 1.5% లెస్ పర్సంటేజ్ తో ఆ పనులను దక్కించుకోవడం వెనుక అధికారులు కాంట్రాక్టర్లు భారీ అవినీతికి పాల్పడ్డట్టుగా స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఇట్టి టెండర్ పనులు ఆర్సిసి పైపులు వినియోగించడంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నాణ్యతతో నిర్మించడం చాంబర్లను నాణ్యతతో కట్టాలని, వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అట్టి టెండర్స్ పొందిన కాంట్రాక్టర్లు నాసిరకం పనులు నిర్వహించారని, ఆర్సీసీ పైపులకు బదులుగా మట్టి పైపులను వాడి నాణ్యత ప్రమాణాలను పాటించకుండా యూజీడీలు నిర్మించారని సూర్య ఆరోపించారు.
వాస్తవంగా సి.డి.ఎం.ఏ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కార్మికుల జీతభత్యాలకు గాని మున్సిపల్ ఎమర్జెన్సీ వ్యవహారాలకు గాని వాడాల్సి ఉన్నప్పటికీ కమిషన్లకు ఆశపడి ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు కార్పొరేషన్ లో గల కాంట్రాక్టర్లు కుమ్మక్కై, ఆ యొక్క డబ్బును అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఏడు ప్యాకేజీలుగా కేటాయించే విధంగా చేసుకొని అతి తక్కువ లెస్ పర్సెంటేజ్ తో ఈ పనులు దక్కించుకోవడం జరిగిందని అన్నారు.
అలా దక్కించుకోవడం వల్ల ఇటు కార్పొరేషన్ కు అటు ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రామగుండం కమిషనర్ ఇట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, క్వాలిటీ కంట్రోల్ విభాగంతో నాణ్యత ప్రమాణాలు చెక్ చేయడంతో పాటు ఈ అవినీతిలో భాగస్వామ్యమైన అధికారుల పైన, కాంట్రాక్టర్ల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విచారణ పూర్తయినంతవరకు ఇట్టి బిల్లులను చెల్లించకుండా ఉండాలని సూర్య డిమాండ్ చేశారు.
ఒకవేళ అధికారులు అట్టి బిల్లులు చెల్లిస్తే రేపు శాఖాపరమైన న్యాయపరమైన చర్యలకు బలికాక తప్పదని సూర్య హెచ్చరించారు.
