కార్పొరేషన్ పరిధిలోని యూజీడీల నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ జరపాలి…

TEJA NEWS

కార్పొరేషన్ పరిధిలోని యూజీడీల నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ జరపాలి…

నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి….

సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య డిమాండ్…

పెద్దపల్లి : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కి సంబంధించిన 13 కోట్ల 70 లక్షల రూపాయలను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి ఏడు ప్యాకేజీలుగా టెండర్లకు పిలవడం జరిగింది, అందులో జరిగిన అవినీతిపై విచారణ జరిపి విచారణ జరిగేంతవరకు అట్టి బిల్లులు చెల్లించకుండా చర్యలు తీసుకోవాలని, అవినీతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు.

సిపిఐ నగర సమావేశం ఉద్దేశించి ఈ సందర్భంగాసిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోశిక మోహన్ తో కలిసి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ “రామగుండం నగరపాలక సంస్థ లో ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కి సంబంధించిన 13 కోట్ల 70 లక్షల రూపాయలకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం ఏడు ప్యాకేజీలుగా టెండర్ల పిలవడం జరిగిందని, కానీ రామగుండం కార్పొరేషన్ లో గల కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారి 0.5 టు 1.5% లెస్ పర్సంటేజ్ తో ఆ పనులను దక్కించుకోవడం వెనుక అధికారులు, కాంట్రాక్టర్లు భారీ అవినీతికి పాల్పడ్డట్టుగా స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు.

అంతేకాకుండా ఇట్టి టెండర్ పనులు ఆర్సిసి పైపులు వినియోగించడంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నాణ్యతతో నిర్మించడం చాంబర్లను నాణ్యతతో కట్టాలని వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అట్టి టెండర్స్ పొందిన కాంట్రాక్టర్లు నాసిరకం పనులు నిర్వహించారని, ఆర్సీసీ పైపులకు బదులుగా మట్టి పైపులను వాడి నాణ్యత ప్రమాణాలను పాటించకుండా యూజీడీలు నిర్మించారని సూర్య ఆరోపించారు.

వాస్తవంగా సి.డి.ఎం.ఏ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కార్మికుల జీతభత్యాలకు గాని మున్సిపల్ ఎమర్జెన్సీ వ్యవహారాలకు గాని వాడాల్సి ఉన్నప్పటికీ కమిషన్లకు ఆశపడి ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు కార్పొరేషన్ లో గల కాంట్రాక్టర్లు కుమ్మక్కై, ఆ యొక్క డబ్బును అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఏడు ప్యాకేజీలుగా కేటాయించే విధంగా చేసుకొని అతి తక్కువ లెస్ పర్సెంటేజ్ తో ఈ పనులు దక్కించుకోవడం జరిగిందని అన్నారు.

అలా దక్కించుకోవడం వల్ల ఇటు కార్పొరేషన్ కు అటు ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రామగుండం కమిషనర్ ఇట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి క్వాలిటీ కంట్రోల్ విభాగంతో నాణ్యత ప్రమాణాలు చెక్ చేయడంతో పాటు ఈ అవినీతిలో భాగస్వామ్యమైన అధికారుల పైన, కాంట్రాక్టర్ల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విచారణ పూర్తయినంతవరకు ఇట్టి బిల్లులను చెల్లించకుండా ఉండాలని సూర్య డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు అట్టి బిల్లులు చెల్లిస్తే రేపు శాఖాపరమైన న్యాయపరమైన చర్యలకు బలికాక తప్పదని సూర్య హెచ్చరించారు.

అంతేకాకుండా ఈరోజు 24 తారీకు వరకు ఇంకా 125 మంది కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమని, అధికారుల పొట్ట నింపుకోవడానికి కార్మికుల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఆరోజు స్టాంపు డ్యూటీ నిధులను అభివృద్ధి కోసం కేటాయించకుండా కార్మికుల జీతాలకు డిపాజిట్ చేసి ఉంటే ఈరోజు కార్మికులకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని అన్నారు, రేపటిలోగా కార్మికుల జీతాలు చెల్లించినట్లయితే 26 తారీకున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరించారు.

ఈ కార్యవర్గ సమావేశంలో మాటేటి శంకర్, శనిగరపు చంద్రశేఖర్, రేణిగుంట్ల ప్రీతం, తొడుపునురి రమేష్, రాణవేణి సుధీర్, ఆసాల నవీన్, శనిగరపు తిరుమల, సాధుల శివ, పోతరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top