మాజీ మంత్రి హరీశ్ రావు సాన్నిధ్యంలో మున్సిపల్ విజేతల ఘన సన్మానం కార్యక్రమం
పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలోని బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రి హరీశ్ రావు సాన్నిధ్యంలో, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ఐదు మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీలు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు మరియు ఎన్నికైన కౌన్సిలర్లందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయం పార్టీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేసిన మున్సిపాలిటీ ఇన్చార్జ్లు మరియు సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇంద్రేశం మున్సిపాలిటీ ఇన్చార్జ్లు:
గోసుల శ్రీనివాస్ యాదవ్ , పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ .
గుమ్మడిదల మున్సిపాలిటీ ఇన్చార్జ్లు:
పట్నం మాణిక్యం , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య యాదవ్ .
గడ్డపోతారం మున్సిపాలిటీ ఇన్చార్జ్లు:
ఎంఎల్సీ శంభిపూర్ రాజు , జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాలు రెడ్డి , కాటా రాజు .
ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇన్చార్జ్లు:
తెలంగాణ మాజీ ఎస్సీ/ఎస్టీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ , తేల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమి రెడ్డి , మాజీ ఎంపీటీసీ కుమార్ గౌడ్ , విష్ణు వర్ధన్ , పృథ్వీ రాజ్ , చంద్రశేఖర్ రెడ్డి గారు, సంపత్ .
జిన్నారం మున్సిపాలిటీ ఇన్చార్జ్లు:
పాల సాయిరాం , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ , అమీన్పూర్ ఎక్స్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి , మాణిక్ యాదవ్ .
వారితో పాటు గుమ్మడిదల మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ,జిన్నారం మండల అధ్యక్షులు రాజేష్ , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ , జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
