మేడ్చల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది

TEJA NEWS

మేడ్చల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.మాజీ మంత్రి, ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అలియాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సాధించింది.

ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అలియాబాద్ మున్సిపాలిటీ ఇంచార్జిగా వ్యవహరించగా గెలుపొందిన కౌన్సిలర్లకు, అలాగే చైర్మన్‌గా ఎన్నికైన కంటం శిరీష కృష్ణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైసిగారి శ్రీనివాస్, కొలన్ జీవన్ రెడ్డి గారు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top