ప్రతి ఓటర్ కు ఓటరు స్లిప్పు అందజేయాలి…
అదనపు కలెక్టర్ రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ..
పెద్దపల్లి// ప్రతి ఓటర్ కు ఓటరు స్లిప్పు అందజేయాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ అన్నారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్ టి పి సి , పి టి ఎస్ కాకతీయ కళ్యాణ మండపంలో అంగన్వాడీ టీచర్లు , మెప్మా ఆర్ పి లు వార్డు అధికారులు , వార్డు అసిస్టెంట్ లతో సమావేశం నిర్వహించారు .
రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబందించి సరాసరి 750 మంది ఓటర్ లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 277 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓటరు స్లిప్పు పంపిణీ చేసినప్పుడు పోలింగ్ కేంద్రం చిరునామా కూడా సదరు ఓటర్ కు తెలియజేయాలని, పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని అవగాహన కల్పించాలని,ఓటర్ స్లిప్పులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి విధుల్లో ఉన్న సిబ్బంది మాత్రమే ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలి తప్పా ఇతరులకు ఇవ్వరాదని అన్నారు. పోలింగ్ శాతం పెరగడానికి ఓటరు స్లిప్పు కీలకమైనందున నిర్ణేత గడువులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు పద్మజా రాణి , సుజాత , అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు , ఎ సి పి శ్రీహరి , టి పి ఎస్ నవీన్ , శిక్షకులు స్వరూప్ చంద్ , కేడo శ్రీనివాస్ , జె. శ్రీనివాస్ , రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు , రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు శంకర్ రావు , ఖాజా , మెప్మా టి ఎం సి మౌనిక , ఆర్ ఓ లు , ఎ ఆర్ ఓ లు , సి ఓ లు పాల్గొన్నారు.
