అడుగడుగునా వివక్షతకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటం

TEJA NEWS

అడుగడుగునా వివక్షతకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపిన నాయకుడు కేసీఆర్ : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

విజయ్ దివాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ తల్లి చిత్రపటానికి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సమైక్య పాలకుల పాలనలో అడుగడుగునా వివక్షతకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షతో దిగివచ్చిన నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రోజే విజయ్ దివస్ అని, దీనికి గుర్తుగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న మనం చేపడుతున్న విజయ్ దివస్ కార్యక్రమాన్ని అన్నారు. నాటి పాలకుల అడుగడుగునా వివక్షతకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపిన నాయకుడు కేసీఆర్ , కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాలు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top