ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

TEJA NEWS

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

తిరుపతి: భారతదేశ మాజీ రాష్ట్రపతి అండ్ మిస్సైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బిజెపి సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తిదా యకమని కొనియాడారు. చిన్నతనంలో అనేక కష్టాలను అనుభవించి ఉన్నత చదువులు అభ్యసించారని గుర్తు చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్తగా దేశ శాస్త్ర – సాంకేతిక రంగంలో విశేష సేవలను అందించి మిస్సైల్స్ తయారీలో పాలుపంచుకు న్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఉపగ్రహాల తయారీలో అబ్దుల్ కలాం పాత్ర కీలకమైనదని కొనియాడారు. ఆయన సేవను మెచ్చిన భారత ప్రభుత్వం ఆయనను రాష్ట్రపతిగా ఎంపిక చేసిందని… రాష్ట్రపతి హోదాలో కూడా అబ్దుల్ కలాం అతి సాధారణ జీవితం గడిపి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన జీవితం నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బిజెపి తిరుపతి సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం పాలక మండలి సభ్యులు తమ్మిశెట్టి చంద్రశేఖర రాయల్, నాయకులు జయంత్ కుమార్, అన్నా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గుర్నాథ్, కృష్ణ, వాసు, గురు ప్రసాద్, పురోహితుడు సురేష్ స్వామి, రంగస్థలం కార్యదర్శి కేఎన్ రాజా, టిడిపి నాయకులు శాంబోలా హరినాథ్, రంగస్థలం నటులు పొన్నాల జేజిరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కన్నప్ప గారి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top