రాజన్న సిరిసిల్ల జిల్లా..
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్.
కార్ సీజ్ , నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలింపు.
వివరాలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి
నిందుతుని వివరాలు.
1.పిట్ల శ్రీకాంత్ తండ్రి: ఎల్లయ్య నివాసం:గంగాపూర్ గ్రామం , చిన్నకోడూరు మండలం,సిద్దిపేట జిల్లా.
ఈసందర్భంగా సి.ఐ మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి కార్(TS 07 HJ 6969) కు తేదీ 19.11.2025 రోజున మధ్యాహ్నం సమయంలో ఇల్లంతకుంట నుండి సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఎవ్వలేదని కారును కొంత దూరం వెళ్లిన తర్వాత తిప్పుకొని వచ్చి ఆర్టీసీ బస్సుకు కారును అడ్డుగా నిలిపి బస్సు డ్రైవర్ బాలరాజును దుర్భాషలాడి బస్సు డ్రైవింగ్ క్యాబిన్లోకి వచ్చి డ్రైవర్ అయిన కల్లూరి బాలరాజును కొట్టి, బస్ అద్దాన్ని పగలగొట్టడానికి రాయితో విసరగా అద్దం పగిలి రోడ్డుకు పక్కన కూర్చున్న వల్లంపట్ల గ్రామానికి చెందిన సండి వజ్రవ్వ మోకాలిపై గాయం తగిలింది.ఘటనను ప్రశ్నించిన ఓబులాపూర్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు బత్తుల రాజవ్వతో కూడా నిందితుడు వాగ్వాదానికి దిగాడు.
మొత్తం ఘటనను బస్సు కండక్టర్ తన మొబైల్ ఫోన్‌లో వీడియోగా రికార్డు చేయగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడు నిన్నటి నుండి పరారీలో ఉండగా,దాడికి గురైన డ్రైవర్ బాలరాజు ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌లో నిన్నటి రోజున కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట ఎస్.ఐ అశోక్ ఆధ్వర్యంలో మూడు టీమ్ లు ఏర్పాడి సాంకేతికత ఆధారంగా ఈరోజు సాయంత్రం రహీంఖాన్ పేట గ్రామ శివాలో నిందితున్ని పట్టుకొని తన మారుతి సుజుకి బలేనో కార్ సీజ్ చేసి నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీ గురించి రిమాండ్ కు తరలించడం జరిగిందని సి.ఐ మొగిలి తెలిపారు..
