
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఆదేశాలతో ఎస్ఆర్ నాయక్ నగర్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
బీఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి వినతితో కదిలిన కరెంట్ విభాగం
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఆదేశాలతో ఎస్ఆర్ నాయక్ నగర్ ప్రాంతంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి అందించిన వినతి పత్రం మేరకు విద్యుత్ శాఖ అధికారులు కదిలారు.
ఇటీవల ఎస్ఆర్ నాయక్ నగర్ మరియు పరిసర కాలనీల్లో పవర్ సరఫరా అంతరాయం, మెయింటెనెన్స్ లోపాలపై బీఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి ఎమ్మెల్యేను కలవగా, ఆయన జీడిమెట్ల ఎలక్ట్రికల్ డీఈ శ్రీనివాసులు తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
దీంతో SE కరుణాకర్ బాబు, డీఈ శ్రీనివాసులు, ఏడీఈ వీరేశం, స్థానిక ఏఈ కృష్ణ తదితర సిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించారు. త్వరితగతిన పరిష్కారం అందిస్తామని హామీ ఇస్తూ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులకు కాలనీవాసుల తరఫున ఆలూరి వెంకట శేషాచారి, గుబ్బల లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పీవీ భాస్కర్ రెడ్డి, సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, సింహాచలం, నాగలక్ష్మి, కృష్ణ కిషోర్, సోమేశ్వరరావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.