
పదేండ్లు రైతుల్ని మోసగించి ఇప్పుడుమొసలి కన్నీరు కారుస్తూ కారు కూతలు కూయడం మానుకోవాలి ……,…. జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి
రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి బే షరతుగా కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
వనపర్తి:
గత పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో రైతు సంక్షేమాన్ని విస్మరించి నేడు రాజకీయ లబ్ధి కోసం సభలు పెట్టి రాహుల్ గాంధీ పై రేవంత్ రెడ్డి ల పై ఆక్రోశంగా ఆసభ్య పదజాలాలతో అనుచిత వ్యాఖ్యలతో కారు కూతలు కూయడం మానుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేటీఆర్ ను హెచ్చరించారు.
గత పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రోజు కూడా ఒక్క రైతు కుటుంబాన్ని వద్దకు వెళ్లి పరామర్శించిన దాఖల లు లేవని ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పందమని
ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే
ప్రాజెక్టుల ముంపు బాధితులపై అర్ధరాత్రి లాటి చార్జి జరిపించిన చరిత్ర బిఆర్ఎస్ దే నేరెళ్ల లో దళిత రైతుల్ని వేధించిన చరిత్ర బిఆర్ఎస్ దే ఆ విధంగా రైతులని మోసాలు చేసి సీఎం రేవంత్ రెడ్డి పై నోరు పారేసుకుంటే ఊరుకో బోం. రైతులను దగా చేసిన నీచ చరిత్ర మీదే
పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ రైతుల్ని ఉరి వేసుకునేలా వరి వేస్తే ఉరి అని మాట్లాడిన కేసీఆర్ దుష్ట పాలన చేసింది కాదా?
పదేండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో నాలుగుసార్లు రూ: లక్ష రుణమాఫీ చేసేందుకు నానా తంటాలు పడ్డి వడ్డీలకే సరిపెట్టింది నిజం కాదా వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోతే పదేండ్లు పైసా ఇవ్వకుండా పర్యాసం చేసింది నిజం కాదా ధరణి పేరుతో వేల మంది రైతుల ఉసురుపోసుకున్నది నిజం కాదా
తాలు పేరుతో రైతులను మోసం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది కాదా?
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలలలో 1.52 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
25 లక్షల మంది రైతులకు రూ:21 వేల కోట్లతో ఏకకాలంలో రూ: 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఊరుట కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలియజేస్తున్నాను.
రైతులకు కౌలు రైతులకు ఏడాదికి 12, వేలతో రైతు భరోసా సాయం చేస్తున్నారు.
వరివేసిన సన్న రకాల రైతులకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తున్నాడు.
పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ10 వేల చొప్పున సాయం అందించారు. సబ్సిడీ ధరకు వ్యవసాయ యత్రిక పరికరాలు ఇస్తున్నాడు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలియజేస్తున్నాము.
రైతును రాజును చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణలో తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటే బి ఆర్ ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు.
కేటీఆర్ అహంకారాన్ని విడిచిపెట్టి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ పెద్దమందడి అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.