కాలనీల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా
- ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీ ల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.
కాప్రా డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే దిశగా పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శ్రీ సాయి ఎన్‌క్లేవ్‌లో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, శివా నగర్‌లో రూ.32 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డుకు, అలాగే సాయి రామ్ నగర్ 2బిహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ పరిధిలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ పనులు పూర్తి అయిన తరువాత స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, అధికారులు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
