
కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు
ఆకస్మిక తనిఖి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి,కలెక్టర్ హిమాన్షు శుక్లా.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తో కలిసి కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను రికార్డులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మరియు కలెక్టర్ ఆసుపత్రిలోని లాబొరేటరీ, ఫార్మసీ స్టోర్, మరియు ఆఫీసు రూమ్‌లను సందర్శించారు.
అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్లు, వైద్య సేవల రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.అనంతరం వివిధ వార్డులను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు సిహెచ్ లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటున్నారా.. ? మందులు సక్రమంగాఅందుతున్నాయా…?అనిఅడిగితెలుసుకున్నారు. అనంతరం జనరల్ వార్డులోని రోగులకు ఆమె స్వయంగా పండ్లను పంపిణీ చేశారు. ఆసుపత్రిలోని ల్యాబ్ పనితీరును స్వయంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఈ సందర్బంగా రక్త పరీక్ష చేయించుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోవూరు సిహెచ్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. కోవూరు సిహెచ్ లో రోగులకు అందిస్తున్న సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు