బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి — బడి బాట కార్యక్రమానికి మంచి స్పందన

TEJA NEWS

బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి — బడి బాట కార్యక్రమానికి మంచి స్పందన

చిలకలూరిపేట :నూతన 2026–27 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, పోలిరెడ్డి పాలెం ఆధ్వర్యంలో “బడి బాట” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. పాఠశాల ఆవాస ప్రాంతంలోని బడి ఈడు గల పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండాలనే సంకల్పంతో, బాల కార్మికులు లేకుండా, నో-ఎన్రోల్మెంట్ పిల్లలు లేకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పోలిరెడ్డి పాలెం ఆవాస ప్రాంతంతో పాటు పెదకొండ్రుపాడు రహదారి ప్రక్కన ఉన్న ఇళ్లను సందర్శించి, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులు వివరించారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉచిత యూనిఫాం పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, షూలు, బెల్టులు, సాక్సులు తదితరంగా మొత్తం 21 రకాల విద్యా సామగ్రి విద్యార్థులకు అందజేయబడుతున్నట్లు తెలియజేశారు.


అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన, డిజిటల్ తరగతులు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధనా విధానాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బాలబాలికను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
గత నాలుగు రోజులుగా సాగిన ఈ బడి బాట కార్యక్రమం ఫలితంగా మొత్తం 25 మంది విద్యార్థులు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా చేరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె. హైమావతి, ఉపాధ్యాయులు పి. శైలజ, పోటు శ్రీనివాసరావు, జి. ఆదిలక్ష్మి, కె. అరుణ, సిహెచ్. నవ్యశ్రీ, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top