అన్ని సంక్షేమ కార్యక్రమలు కొనసాగించాలి

TEJA NEWS

అన్ని సంక్షేమ కార్యక్రమలు కొనసాగించాలి : సికింద్రాబాద్ ఏం ఎల్ ఏ పద్మారావు గౌడ్ సూచన
• లబ్దిదారులకు చెక్కుల పంపిణీ


సికింద్రాబాద్ : గత కే సి ఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటి వివిధ పధకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మారేడుపల్లి, ముషీరాబాద్ మండలాలకు చెందిన 255 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీతాఫలమండీ చౌరస్తాలో పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సంబంధించి చేసిన హామీలు నెరవేర్చాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ప్రభుత్వం వద్ద నిధులు లేవని పదే పదే పేర్కొనడం సరికాదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో నిరంతరం తాము ప్రజలకు అండగా నిలుస్తున్నామని, సీతాఫలమండీ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే పద్దతిని పద్దతిని పాటిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు తాము అండగా నిలుస్తామని, ఏ అవసరానికైనా ప్రజలు తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. మారేడుపల్లి ఏం ఆర్ ఓ భీమయ్య గౌడ్, ముషీరాబాద్ ఏం ఆర్ ఓ ప్రతాప్ సింగ్, కార్పొరేటర్లు సామల హేమ, వెంకట లక్ష్మీ, కార్పొరేటర్లు సామాల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, రాసురి సునీత, తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లి మండలానికి చెందిన 159 మందికి, ముషీరాబాద్ కు చెందిన 96 మందికి రూ.2.55 కోట్ల మేరకు విలువజేసే చెక్కులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పంపిణీ చేశారు

You cannot copy content of this page

Scroll to Top