
రావిపహాడ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కాంపటి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ దేశానికి అందించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలు ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినవని అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. యువత అంబేద్కర్ ఆలోచనలను అనుసరించి సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ శామాలేటి కోటేష్, పొడపంగి యలమంచి, దేవయ్య, కిష్టయ్య, వీరమళ్ళ రాము శామాలేటి తిరుపయ్య యువత, పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు