బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఆశయాలు మార్గదర్శకం.

TEJA NEWS

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఆశయాలు మార్గదర్శకం.

డా. బి.ఆర్. అంబేద్కర్ సామూహిక భవనాన్ని ప్రారంభించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు , బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ సామూహిక భవనాన్ని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు మరియు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, పోరాటాల వల్లే సమాజంలో అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తాము ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాచారం సునీత-మురళీ యాదవ్ , బెంబెడి వనిత-బుచ్చిరెడ్డి , పల్పునూరి మౌనిక-విష్ణువర్ధన్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల బాల్ రెడ్డి , ఎస్.వి. సురేందర్ రెడ్డి , పోలీస్ గోవింద్ రెడ్డి , మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top