రిపబ్లిక్ డే సందర్భంగా 25, 26వ తారీఖులల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మట్టి కుస్తీ పోటీలు
పల్నాడు జిల్లా చిలకలూరి పేట లోని ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ లో ఆంధ్ర ప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ మరియు పల్నాడు జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడునని శ్రీ వీరాంజనేయ మల్లయుద్ధ వ్యాయామశాల చిలకలూరిపేట అధ్యక్షులు పేరుబోయిన వెంకటేశ్వర్లు, కోశాధికారి సాపా వీర రాఘవులు,కార్యదర్శి బత్తుల సుబ్బారావులు తెలిపారు. స్థానిక పండరీపురం రెండో లైన్లో గల ఏలూరు సిద్దయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాటను బట్టి..సీనియర్ పురుషులు (ఓపెన్)కేటగిరీలో 55,60,65, 70,75,80,85 కేజీల వారు 85 కె.జిల వారు 140 కేజీల వారితో చాలెంజ్ పోటీ క్రింద పొట్లాడతారు.
సీనియర్ (ఓపెన్
ఉమెన్) 48,52,56,62 కె.జీలు 60 కె.జి. ల వారు 120 కె.జి.ల వారిపై ఓపెన్ చాలెంజ్ లో పొట్లాడిస్తారు… జూనియర్ బాయ్స్ 52,57,61,65,74,86 కె.జిలాల్లో ఓపెన్ కెటగిరిలో 90 నుంచి 120 కె.జి.లలో పొట్లాడతారు… జూనియర్ మహిళలు అయితే 46,50,54,58,62,65 కె.జి.ల వారు ఓపెన్ కేటగిరీలో 65 నుంచి 80 కె.జిల వారితో పొట్లాడతారు.. సినియర్ ఫహిల్వాన్ లకు వయస్సు 19 నుంచి 20 సంవత్సరాలు ఉండాలి. అదే జూనియర్లు అయితే 16 నుంచి 19 వయస్సు కలిగి ఉండాలన్నారు. ఈ పోటీలలో పాల్గొను వారు తప్పని సరిగా ఆధార్ కార్డుతో పాటుగా 2 పాస్ పోర్టు ఫోటోలతో ఆర్.వి.ఎస్. సి.వి.ఎస్ హై స్కూల్ లో ఈ నెల 24వ తరీఖు లోపు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పేరుబోయిన మావో శ్రీనివాసరావు సెల్ నం. 9391077411.. వారి వద్ద పేర్లను తప్పని సరిగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శిలు బోనాల. సంతోష్ కుమార్ పహిల్వాన్, ఆర్జా. పాండు రంగారావులు పాల్గొంటారు.
మరిన్ని వివరాల కోసం పాండు రంగారావు.. 7396225080 ను సంప్రదించ గలరు. మొదటిగా 25వ తరీఖు నాడు ముఖ్య అతిధులు కార్యక్రమ ప్రారంభికులు నియోజవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ పహిల్వా ఎస్.కే. కరీముల్లా వైస్ చైర్మన్ పిల్లి. కోటి,చిలకలూరిపేట శ్రీ విద్యా సంఘం చైర్మన్ తేల సుబ్బారావు, జనసేన నియోజకవర్గ ప్రముఖ నాయకులు తోట రాజా రమేష్, మండలనేని చరణ్ తేజ, మున్సిపల్ చైర్మన్ ఎస్.కె రఫాని, బిజెపి పల్నాడు జిల్లా కార్యదర్శి గట్ట హేమ సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై. రాధాకృష్ణ, సిపిఐ నియో జకవర్గ సమితి కార్యదర్శి తాళ్లూరి బాబు రావు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎం. రాధాకృష్ణ శ్రీ వీరాంజనే య మల్ల యుద్ధ వ్యాయామశాల జాయింట్ సెక్రటరీ మజ్ను ప్రముఖ బాడీ బిల్డర్ ఎస్.కె ఇమ్రాన్ పాల్గొనున్నా రు.. మరుసటి రోజు 26వ తారీఖున సభ ప్రారంబికులు మండల శాసన సభ్యులు మర్రి. రాజశేఖర్,అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
