
41వ. డివిజన్ లోని అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా అన్నప్రాసన, బాల్య సంరక్షణ, విద్య డే కార్యక్రమం….
-సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య…
పెద్దపల్లి// . రామగుండం కార్పొరేషన్ పరిధి 41వ. డివిజన్లోని జవహర్ నగర్ 1 అంగన్వాడి కేంద్రం లో రామగుండం ప్రాజెక్టు సిడిపిఓ అలేఖ్య సిపిఐ ఫ్లోర్ లీడర్ 41వ. డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ఆధ్వర్యంలో అంగన్వాడి సెంటర్లో అన్నప్రాసన,బాల్య సంరక్షణ, విద్య డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ “అంగన్వాడి సెంటర్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంగన్వాడి సెంటర్ లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి దోహదపడుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. అలాగే కడుపుతో ఉన్నవారు అంగన్వాడి సెంటర్ కి వచ్చి సెంటర్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువగా అంగన్వాడి సెంటర్ కి రావడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఒక మంచి వాతావరణం లో అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్లను ఈ సందర్భంగా వారికి అభినందనలు చెబుతూ, మరింత మంది విద్యార్థులు చేరే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
అంగన్వాడీ కేంద్రానికి కావాల్సిన ఏ అవసరమైన నా దృష్టికి తీసుకువస్తే కౌన్సిల్లో మాట్లాడి సాంక్షన్ చేయించే బాధ్యత నాదేనని సూర్య తెలిపారు. ఒక మంచి వాతావరణం లో అన్నప్రాసన జరగడం చాలా సంతోషంగా ఉందని మున్ముందు మరిన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి పాటుపడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కపురి ప్రసన్న లక్ష్మీ, అంగన్వాడి టీచర్లు కె.అరుణ ఎస్.జయసుధ, తల్లులు గర్భిణీలు బాలింతలు, కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.