జీడిమెట్ల విలేజ్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమం

TEJA NEWS

జీడిమెట్ల విలేజ్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న *కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్…..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల విలేజ్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి 22వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ముఖ్యఅతిథిగా *మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ * హాజరయ్యి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు…..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు…

అనంతరం ఆలయంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు నీ మరియు ఆంజనేయ స్వామి వారినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

అనంతరం అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు…

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top