మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం

TEJA NEWS

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు

వేలం పాటలో రూ. 16.65 లక్షలకు అమ్ముడుపోయిన 84 కోళ్లు

ఈ నెల 12న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్టలో ఓ ఫాంహౌస్లో కోడి పందేలు నిర్వహిస్తూ 64 మంది పట్టుబడగా 85 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

దాంట్లో ఒకటి మృతిచెందగా మిగిలిన వాటిని రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు

అయితే న్యాయమూర్తి వేలంపాట నిర్వహించడంతో.. వేలంపాట సమాచారం అందుకున్న పందెం రాయుళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు

వీరిలో ఏపీ లోని రాజమహేంద్రవరం, ఏలూరు, నూజివీడు తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు

ఇదే కేసులోని నిందితుల అనుచరులు సైతం పాల్గొని తమ కోళ్లను దక్కించుకున్నారు..

You cannot copy content of this page

Scroll to Top