కొంపల్లి మున్సిపాలిటీలో ఊర చెరువు సుందరీకరణ,

TEJA NEWS

కొంపల్లి మున్సిపాలిటీలో ఊర చెరువు సుందరీకరణ, దూల్లపల్లి బిటి రోడ్డు మంజూరై తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ఇఎన్ సి నర్సింహా రెడ్డి, ఎస్ ఇ వెంకటేశ్వర్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఊర చెరువు సుందరీకరణ అలాగే దూల్లపల్లి ఎన్ టి ఆర్ విగ్రహం నుండి ఇండస్ట్రియల్ ఏరియా వరకు సరైన రోడ్డు మార్గం లేక గుంతలు ఉండటం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్నీ మాజీ ఎమ్మెల్యే తెలుసుకొని బిటి రోడ్డు మంజూరు కొరకై తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ఇఎన్ సి నర్సింహా రెడ్డి, ఎస్ ఇ వెంకటేశ్వర్ ను కలిసి దూలపల్లి ప్రజలు,వాహనదారులు పడే ఇబ్బంది తెలియజేయడం జరిగింది..

అనంతరం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ఇఎన్ సి నర్సింహా రెడ్డి, ఎస్ ఇ వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించి తక్షణ మంజూరుకు సహకరిస్తాం అని తెలిపారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ ఆ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు..

ఈ సమావేశంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top