ఆటో డ్రైవర్ గంజాయి రవాణా.. 5 ఏళ్ల జైలు
సంగారెడ్డి జిల్లా కోర్టు 1.5 కిలోల డ్రై గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడు ఎండీ సిరాజ్‌కు కఠిన శిక్ష విధించింది. 2020లో నమోదైన ఈ కేసును విచారించిన అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఈ తీర్పుతో మరోసారి స్పష్టమైంది.
