ఐ.పీ.ఎల్, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్.మానుకోండి.*

TEJA NEWS

ఐ.పీ.ఎల్, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్.మానుకోండి.*
మీ విలువైన భవిష్యత్తును మార్చుకోండి

అశ్వారావుపేట ఎస్సై, యయాతి రాజు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై స్టూడెంట్స్ కు కుపలు సూచనలు.

. అశ్వారావుపేట* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం పోలీస్ స్టేషన్, ఎస్సై.యయాతి రాజు, మాట్లాడుతూ,బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి.కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి.జాగ్రత్త ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐ.పీ.ఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక చీకటి వ్యాపారం.చిన్న చిన్న చేపలను అమాంతం మింగేస్తాయి జాగ్రత్త.పెద్దలకు సూచన.ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోండి.లేదంటే డబ్బులు, ప్రాణాలు రెండు పోయే అవకాశం ఉంది.మీ కష్టార్జితాన్ని, కన్న బిడ్డలను ఈ దోపిడీ దొంగల బారిన పడనివ్వకండి.ఐ.పీ.ఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఐ.పీ.ఎల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ఎవరైనా ఐ.పీ.ఎల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వగలరని ఆయన తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top