“ఆపరేషన్ సింధూర్” పై కేంద్ర మంత్రిచే అవగాహన
తిరుపతి: త్రిపుర మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ విప్లవ్ కుమార్ దేవ్ తిరుపతికి విచ్చేసి “ఆపరేషన్ సింధూర్” పై ప్రజలకు అవగాహన పెంచారు. ఆ ఆపరేషన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను వివరించారు. తద్వారా ప్రపంచ దేశాలకు కూడా మనదేశం సత్తాను నిరూపించారు. అవగాహన కార్యక్రమానికి తిరుపతికి విచ్చేసిన సందర్భంగా జిల్లా బీజేపీ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి శాలువలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గుండాల గోపినాధ్ రెడ్డి, జిల్లా నేతలు పి.నవీన్ కుమార్ రెడ్డి, అజయ్ కుమార్, చంద్రా రెడ్డి, విశ్వనాదం ఉన్నారు.
