బ్యాంకింగ్ రంగ సమస్యలు పరిష్కరించాలి
** యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిమాండ్
తిరుపతి: బ్యాంకింగ్ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ
అఖిల భారత బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు చెందిన 9 యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈనెల 27న దేశావ్యాప్త సమ్మె చేపట్టానున్నట్లు స్టేట్ బ్యాంక్ యూనియన్ జనరల్ సెక్రటరీ గిరిధర్ తెలిపారు. ఈ సమ్మెలో
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్… ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్…నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్…ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్…బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా…ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్… ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్….నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ తో సహా నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ కలిపి మొత్తం 9 యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని బ్యాంకులలో పనిచేస్తున్న సుమారు 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల ఆధ్వర్యంలో ఈనెల 27న అఖిల భారత బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు,
సహకార బ్యాంకులు
డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్టు చెప్పారు.
బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయడానికి ప్రభుత్వ ఆమోదం తెలపడం, మిగిలిన శనివారాలను (ప్రస్తుతం 2వ… 4వ శనివారాలు ఇప్పటికే సెలవు దినాలు) సెలవు దినాలుగా ప్రకటించడం. ఇది 7-12-2023 నాటి ఒప్పందం…. 8-3-2024 నాటి సెటిల్‌మెంట్/జాయింట్ నోట్ ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చేసిన సిఫార్సుల మేరకు ఉండాలి.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరపున మేము బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 పనిదినాలను ప్రవేశపెట్టాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాము. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ప్రభుత్వం అంగీకారంతో ప్రతినెల 2వ, 4వ శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించారు, మిగిలిన శనివారాలు పూర్తి పనిదినాలుగా మారాయి.
అప్పట్లో మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించే డిమాండ్‌ను త్వరలోనే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ అంశం పెండింగ్‌లో ఉండిపోయింది.
2022లో, రోజువారీ పని గంటలను పెంచి, మిగిలిన శనివారాలను సెలవులుగా ప్రకటించే అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం, ఐబీఏ అంగీకరించాయి. 2023లో జరిగిన చర్చల అనంతరం, సోమవారం నుండి శుక్రవారం వరకు రోజువారీ పని గంటలను 40 నిమిషాలు పెంచడానికి… మిగిలిన శనివారాలను సెలవులుగా ప్రకటించడానికి అంగీకారం కుదిరింది.
దీనిని ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ, దురదృష్టవశాత్తు గత రెండేళ్లుగా ప్రభుత్వం నుండి ఆమోదం లభించలేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చింది. అప్పట్లో ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం అందడంతో సమ్మెను వాయిదా వేసాము.
అంతటి గట్టి హామీ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదం తెలపడం లేదు. అందుకే, వివిధ నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిన తర్వాత, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 27న సమ్మెకు పిలుపునిచ్చింది.
తమ పట్ల మాత్రమే వివక్ష చూపుతున్నారని బ్యాంక్ ఉద్యోగులు మరియు అధికారులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అందుకే ఈ సమ్మె మాపై బలవంతంగా రుద్దబడింది.
దీనివల్ల కలిగే అసౌకర్యానికి బ్యాంక్ వినియోగదారులు మమ్మల్ని సహకరించవలసిందిగా కోరుతున్నాము.
