TEJA NEWS

బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్లో చర్చించాలి.

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

బీసీ నేత ఎంపీ, ఆర్ కృష్ణయ్య గళం విప్పాలి

జగిత్యాల జిల్లా కేంద్రంలో గల ఇందిరాభవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ అమలు కోసం కృషి చేయాలని అన్నారు.రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అని తెలిపారురిజర్వేషన్లు స్థానిక సంస్థలకేపరిమితంకాదు,విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలులో ఉండాలని,అన్నారు 50 శాతంరిజర్వేషన్ పరిమితితొల గించేలాచర్యలు చేపట్టాలని అన్నారు రాహుల్ గాంధీ,ఆలోచనతో 42శాతంరిజర్వేషన్ తెరపైకి తీసుకువచ్చారన్నారు,అన్ని రాజకీయ పార్టీలు 42శాతం రిజర్వేషన్ కు అనుకూలం గా ఉంటుందన్నారు42 శాతం రిజర్వేషన్ అమలు కోసం 9వ షెడ్యూల్ లో చేర్చాలని అన్నారు

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే 42 శాతం రిజర్వేషన్లు అమలు అమలు చేయవలసి వస్తుందనిఅన్నరు,గ్రామపంచాయతీలకుఎన్నికలునిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేనిధులుపొందలేకపోతున్నామన్నారు సామాజికంగా వెనకబాటు తనానికి గురి అవుతున్న బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చూడాలన్నారు.అన్ని రాజకీయ పార్టీలు 42 శాతం రిజర్వేషన్ అమలుకు అనుకూలమని, చెబుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు అచరణలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని తెలిపారుబలహీన వర్గాల తరపున ఆర్ .కృష్ణయ్య చేస్తున్నపోరాటంఅభినందనీయం ఉన్నారు.అన్ని రాజకీయ పార్టీలను సమన్వయ పరిచి, లోకసభ, రాజ్యసభలో చర్చించే అంశంగా లేవనెత్తేలా,ఆర్ కృష్ణయ్య చొరవ తీసుకోవాలనివిజ్ఞప్తిచేస్తున్నాన్నరుబలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల కి పరిమితమైంది కాదన్నారు


శీతాకాల పార్లమెంటుసమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం చొరవ తీసుకోవాలని అన్నారు.బలహీన వర్గాల జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం,అన్ని రాజకీయ పార్టీలపైబాధ్యతఉన్నదన్నారు.స్వర్గీయ మాజీప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ,పాలనా కాలంలోకేంద్రం నుండినేరుగాగ్రామపంచాయతీలకు నిధులు అందేలా చర్యలు చేపట్టారన్నారు, ఈ సమావేశంలో టి.పి.సి.సి. రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య మాజీ కౌన్సిలర్లు ఎలిగేటి నరసయ్య, అబ్దుల్ బారి, పుప్పాల అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ చందా రాధా కిషన్ రావు, తో పాటు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు