భగీరథ మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలి

TEJA NEWS

భగీరథ మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలి…కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు..


నేటి నుంచి పట్టణమంతటా యధావిధిగా తాగునీటి సరఫరా.
కోదాడ పట్టణానికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ మేజర్ పైపులైన్లకు జరుగుతున్న మరమ్మత్తు పనులను మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనుల్లో జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి పట్టణంలోని అన్ని వార్డులకు అంతరాయం లేకుండా తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఫీట్టర్ హనుమంతరావు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top