మల్లన్న జాతర సందర్భంగా శ్రద్ధా భక్తులతో భక్తిమయంగా మారిన భౌరంపేట్ గ్రామం….
ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన MLC శంభిపూర్ రాజు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్, భౌరంపేట్ లో మల్లన్న జాతర సందర్భంగా భక్తుల పూజలతో గ్రామం భక్తి మయంగా మారింది. జాతర లో భాగంగా మేడ్చల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఇలాంటి సంప్రదాయ పండుగలు మన సంస్కృతి, ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు.
అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS పార్టీ సీనియర్ నాయకులు SV. సురేందర్ రెడ్డి , పోలీస్ గోవింద్ రెడ్డి , ధర్మారెడ్డి , మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతరను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీని MLC అభినందించారు.
