
రాజకీయ ఉనికి కోసమే “భూమన” ప్రెస్ మీట్ లు
….
చిత్తూరు / పూతలపట్టు: తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం…, తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని చెప్పుకోవడం కోసం…, ప్రజలు నన్ను గుర్తు పెట్టుకోండని మొర పెట్టుకోవడం కోసమే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లు పెడుతుంటారని టీడీపీ రాష్ట్ర అధికార మాజీ ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, చిత్తూరు కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్ వ్యాఖ్యానించారు. బుధవారం వాళ్ళు చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన వెంకటేశ్వర స్వామి పైన కూడా భూమన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. టిడిపి నాయకులు రాజా, ఖందస్వామి, బాలకృష్ణ నాయుడు కూడా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
శ్రీవాణి నిధుల్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేబులోకి మల్లిపోయిందని, లోకేష్ బాబు ఖాతాలోకి వెళ్లిందనీ, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ… తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ హయంలో శ్రీవాణి నిధులను దాదాపు 800 కోట్లను తన వైసిపి కార్యకర్తలకి ఫలహారాలు పంచిపెట్టినట్టు పంచిపెట్టి నారు. కనీసం శ్రీవాణి టికెట్లుకి రసీదులు కూడా ఇవ్వకుండా దోచుకున్న చరిత్ర వైసీపీ నాయకులకు ఉంది. అదేవిధంగా గతంలో గోశాలలో గోవులు చనిపోయాయని ఆరోపణలు చేసి తీరా సవాల్ విసిరి… తుర్రుమన్నారు. మళ్లీ వెంకటేశ్వర స్వామి విగ్రహంని చెత్తలో పడేశారని ఆరోపణ చేసి తీరా అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదని తేలిన తర్వాత చేతులెత్తేశారు.
మళ్లీ ఇప్పుడు శ్రీవాణి నిధులు దుర్వినియోగమైందని నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు. వైసీపీ హయంలో శ్రీవాణి నిధుల్ని దాదాపు ఫలహారాలు పప్పు బెల్లాలు పంచినట్టు జగన్మోహన్ రెడ్డి పంచి, శ్రీవారి హుండీకి కన్నం పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, అన్న విషయాన్ని మరిచిపోకూడదు. అదేవిధంగా కల్తీ నెయ్యి కుంభకోణం నుండి, డాలర్ల చోరీ కేసు నుండి ప్రజల దృష్టిని మల్లించడానికి, ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని పక్కదారి పట్టించడానికి ఇటువంటి పత్రికా సమావేశాలు అప్పుడప్పుడు పెట్టి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి సతవిధాల ప్రయత్నిస్తున్నారని అన్నారు