బొల్లారం మెయిన్ రోడ్డు వరకు రూ 1 కోటి 50 లక్షల రూపాయల అంచనావ్యయం

TEJA NEWS

మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎనక్లేవ్ కాలనీ నుండి బొల్లారం మెయిన్ రోడ్డు వరకు రూ 1 కోటి 50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి (Storm water drain) వరద నీటి కాలువ నిర్మాణం పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 1.50 ఒక కోటి యాబై లక్షల రూపాయల నిధులతో వరద నీటి కాల్వ నిర్మాణం పనులను చేపట్టడం జరిగినది అని, వరద నీరు కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ,రాబోయే వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా , వర్షాకాలం లోపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. త్వరలో నే వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని,పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని ,పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు. వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పై అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని , చుట్టుపక్కల కాలనీ వాసులకు ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరునని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలకు అన్ని రకాల మౌళికవసతుల కల్పనకు కృషి చేస్తున్నాం అని, మౌళికవసతులు కల్పించడంలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నాం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE దుర్గా ప్రసాద్ వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మర్రపు గంగాధర్ రావు, తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, నరేష్ నాయక్, శివ ముదిరాజు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top