షాపూర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు

TEJA NEWS

షాపూర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు మరియు ప్రింటర్ పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పుస్తకాలు మరియు పింటర్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు..

అనంతరం ప్రభుత్వ బడుల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు సహకరిస్తున్న గణేష్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

షాపూర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శిధిలావస్థలో ఉన్న ఎంఈఓ ఆఫీస్ కోసం మంజూరైన 54 లక్షలతో భవనం పునర్నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

నాలుగు గోడల మధ్య ఉన్న విద్యార్థుల ఆలోచనలే రేపటి బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుందన్నారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల కోసం ప్రభుత్వ బడులలో అనేక సౌకర్యాలను సమకూరుస్తుందన్నారు. కావున ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు పెరుగుతున్నాయన్నారు…

ఈ కార్యక్రమంలో కూన రాఘవేందర్ గౌడ్, బుచ్చి రెడ్డి, మండల విద్యాధికారి జెమిని , పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంత కుమారి, శ్రీహరి, యాదగిరి, శివ, కృష్ణ ప్రసాద్, కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, మాధవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top