గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయం

TEJA NEWS

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంభీపూర్ క్రిష్ణ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ కాజిపల్లి 5,6 వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గద్దె సుష్మ గణేశ్ మరియు గండి స్వప్న కు మద్దతుగా ఉదయం 6:30 నుండి 9:30 గంటల వరకు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top