బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

TEJA NEWS

బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాగరాజు …

వర్ధన్నపేట పట్టణ పరిధిలోని డిసి తండా 6వ వార్డు చెందిన బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పలువురిని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ:-…

కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కొత్త–పాత అనే తేడాలు లేకుండా అందరూ ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులుగా పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….

ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, , టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు దేవేందర్, తారాభాయి, శ్రీధర్ తో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top