“శ్రీ గాయత్రి స్కూల్” ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

TEJA NEWS

“శ్రీ గాయత్రి స్కూల్” ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

130 – సుభాష్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ లో లక్ష్మీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ గాయత్రి స్కూల్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో శ్రీ గాయత్రి స్కూల్ అత్యున్నతంగా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు. పిల్లల భవిష్యత్తు రూపకల్పనలో పాఠశాల యాజమాన్యం, టీచర్లతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నరేందర్ కృష్ణ, నవీన్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ,అడపా శేషు కుంటి మల్లేష్, దుబాయ్ శ్రీను, సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top