బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్

TEJA NEWS

బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …

సుభాష్ నగర్ పైప్లైన్ రోడ్డులో నూతనంగా చేపడుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వివిధ శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను దాదాపు 56 కోట్ల రూపాయలతో చేపడుతున్నామని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసిపి వెంకట్ రాంరెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ ఈఈ శ్రీనాథ్ రెడ్డి, డీఈఈ వెంకట రమణ, ఏఈఈ శోభన్ జిహెచ్ఎంసి ఈఈ లక్ష్మీ గణేష్, డీఈ పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top